SOBHITA DHULIPALA: బ్లాక్ శారీలో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోన్నశోభితా ధూళిపాళ
హీరోయిన్ :శోభితా ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
దిశ, సినిమా: హీరోయిన్ :శోభితా ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో సెకంట్ ప్లేస్‌లో నిలిచిన ఈ బ్యూటీ అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ‘రామన్ రాఘవ్ 2. 0’ హిందీ చిత్రంతో నటన ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘గూఢచారి, పొన్నియన్ సెల్వన్: 1, మేజర్, కళాకంది, సితార, మంకీ మ్యాన్, కురుప్’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది. అంతేకాకుండా ‘మేడ్ ఇన్ హెవెన్, బర్ద్ అఫ్ బ్లడ్, ది నైట్ మేనేజర్’ వంటి వెబ్ సిరీస్‌ల్లో మెరిసి తన సత్తా చాటింది.
ఇకపోతే ఈ భామ నటించిన మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ లో తన అద్భుతమైన నటనకు తాజాగా అవార్డు గెలుచుకుంది. ఈ సందర్భంగా శోభితా ఈ వెబ్ సిరీస్ టీమ్ కు ధన్యవాదాలు చెబుతూ.. అవార్డు చేతిలో పట్టుకుని ఖతర్నాక్ ఫొటో షూట్ చేసింది. బ్లాక్ శారీలో స్టన్నింగ్ ఫొటోలకు ఫొజులిచ్చి, యువతకు పిచ్చేక్కిస్తోంది. నడుము అందాలతో గోడకు చేతులు పెట్టి స్లివ్‌లెస్ బ్లౌస్‌లో అదరహో అనిపిస్తోంది. ప్రస్తుతం శోభితా ధూళపాళ లేటెస్ట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. లవ్ సింబల్స్ జోడించి బ్యూటిఫుల్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.