ప్లీజ్ నాకు అలాంటి మొగుడిని వెతికిపెట్టండి.. బోల్డ్ బ్యూటీ రిక్వెస్ట్

బోల్డ్ బ్యూటీ షెర్లిన్ చోప్రా మరోసారి తన పెళ్లి విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Update: 2023-04-03 07:41 GMT

దిశ, సినిమా : బోల్డ్ బ్యూటీ షెర్లిన్ చోప్రా మరోసారి తన పెళ్లి విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు తన కెరీర్‌‌లో ఎదురైన చేదు అనుభవాలను సైతం గుర్తుచేసుకుంటూ తాజా ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయింది. ‘నాకు భర్త కావాలి. కానీ, అతను మిలియనీర్ అయ్యి ఉండాలి. అతను ఒకే మహిళను ఇష్టపడే వ్యక్తిగా మిగిలిపోవాలి. అబద్ధాలు ఆడకూడదు. నిజాయతీగా, మంచి మనసు కలిగివుండాలి. ఈ లక్షణాలన్నీ ఉన్నవాడినే నాకు భర్తగా వెతికిపెట్టమని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ‘నన్ను ఇండస్ట్రీ మొత్తం రిజెక్ట్ చేసింది. మహేష్‌భట్, రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులు నన్ను తిరస్కరించారు. ఎందుకనే కారణాలు తెలియవు. ఓసారి ‘నీలో విషయం లేదు. నువ్వు సాల్టీగా లేవు’ అన్నారు. కెరీర్‌ మొదట్లో నా సినిమాలు ఫెయిల్ అయితే చనిపోదామనుకున్నా’ అంటూ ఆసక్తికరంగా మాట్లాడింది. 

Tags:    

Similar News