'కార్తికేయ-3' చేయకపోతే ఆమె నన్ను వదలదు: నిఖిల్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ 'కార్తికేయ-2' తో భారీ విజయాన్ని పొందిన విషయం తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్లల్లో రికార్డులు సృష్టించి బాక్సాఫీసును బద్దలు కొట్టింది.. Latest Telugu News
దిశ, వెబ్డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ 'కార్తికేయ-2' తో భారీ విజయాన్ని పొందిన విషయం తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్లల్లో రికార్డులు సృష్టించి బాక్సాఫీసును బద్దలు కొట్టింది. అయితే 'కార్తికేయ 2' కు సీక్వెల్ ఉందా లేదా అన్న అనుమానాలు ప్రేక్షకుల్లో వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో హీరో నిఖిల్ దీనిపై స్పందించి ఓ క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిఖిల్ మాట్లాడుతూ '' కార్తికేయ 2 హిట్ తర్వాత సీక్వెల్ ఉంటుందని నేను అనుకోలేదు. కానీ, నేను ఎక్కడికి వెళ్లినా ఇంతకముందు కార్తికేయ 2 ఎప్పుడు అని అడిగేవారు. అందుకే ఆ చిత్రం వచ్చింది. ఇప్పుడు 'కార్తికేయ3' గురించి అడుగుతున్నారు. ఇక ఈ సినిమా చేయకపోతే అభిమానులు ఏమంటారో తెలియదు. కానీ, మా అమ్మ మాత్రం నన్ను వదలదు. అమ్మ కోసమైనా ఆ మూవీ చేయాలి'' అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇవి కూడా చదవండి : నేషనల్ క్రష్పై బాలయ్య ఇంట్రెస్ట్.. క్రష్ అంటూ రెచ్చిపోయిన నటసింహం