Shahrukh - Vicky : సమంత 'ఊ అంటావా..' పాటకు హాట్ స్టెప్పులతో రెచ్చిపోయిన షారుఖ్, విక్కీ కౌశల్

హాట్ స్టెప్పులతో రెచ్చిపోయిన షారుఖ్, విక్కీ కౌశల్

Update: 2024-09-29 04:45 GMT

దిశ , వెబ్ డెస్క్ :  పుష్ప పార్ట్ 1 మూవీలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా ఊ ఊ అంటావా.. పాట ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. మన తెలుగులోనే కాకుండా వరల్డ్ వైడ్ గా ఈ సాంగ్ పాపులర్ అయింది. సోషల్ మీడియాలోనే కాకుండా ఈ ఒక్క పాటకే ఎంతో మంది రీల్స్ చేసారు. ఆ పాటలో వారిద్దరూ వేసిన స్టెప్పులుకు జనాలందరూ ఫిదా అయిపోయారు.

తాజాగా, ఊ అంటావా ఊ ఊ అంటావా పాటకి ఐఫా వేదికపై బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్ హాట్ స్టెప్పులతో డ్యాన్స్ కుమ్మేసారు. బాలీవుడ్ కి సంబంధించిన అవార్డు ఫంక్షన్ లో చాలా మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే షారుఖ్, విక్కీ కౌశల్ స్టేజిపై సందడి చేసారు. ఊ అంటావా ఊ ఊ అంటావా సాంగ్ కి ఈ ఇద్దరూ కలిసి స్టెప్పులు వేశారు.

ఫ్యాన్స్ తమ హీరోల డ్యాన్స్ ను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు వారి డ్యాన్స్ ను చూసి ఆ స్టెప్పులేంటీ సామీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News