రణ్‌వీర్ సింగ్ ప్రవర్తనపై సీనియర్ నటుడు సంచలన వ్యాఖ్యలు..!

బాలీవుడ్ సీనియర్ నటుడు ‘శక్తిమాన్’ ఫేమ్ ముఖేశ్ ఖన్నా రణ్‌వీర్ సింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కొద్ది కాలం క్రితం రణ్‌వీర్ నన్ను కలిశారు.

Update: 2024-09-30 13:50 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటుడు ‘శక్తిమాన్’ ఫేమ్ ముఖేశ్ ఖన్నా రణ్‌వీర్ సింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కొద్ది కాలం క్రితం రణ్‌వీర్ నన్ను కలిశారు. అయితే ఆయన నాతో శక్తిమాన్ రోల్‌‌లో తాను నటించాలని అనుకుంటున్నానని చెప్పారు. దానికి నా అంగీకారం కోరుతూ నన్ను సంప్రదించారు. నా ముందు అతను దాదాపు మూడు గంటల పాటు కూర్చున్నారు. నేను ఏదైతే చూడాలనుకున్నానో దానిని రణ్‌వీర్ కళ్లలో చూడలేకపోయాను. సరదాగా ఇతరులను కాస్త ఇబ్బందులు పెట్టేలా ఆయన ప్రవర్తన ఉంది.

అతను మంచి నటుడే అయినప్పటికీ ఆ రోల్ ఆయన చేయలేరని అనిపించింది. అప్పుడే ఆ విషయం చెప్పి పంపించాను. అయితే ఒకానొక సమయంలో రణ్‌వీర్ చేసిన న్యూడ్ ఫొటోషూట్ ఆయనపై నాకు చిరాకును కలిగించింది. న్యూడ్‌గా చేయలేదని శరీరంపై దుస్తులు ఉన్నాయని నాతో చెప్పారు. అంతేకాకుండా ప్రమోషనల్ టీమ్‌ను కూడా తొలగించాను అని తెలిపారు. అప్పుడు అతన్ని నేను నమ్మాను కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు న్యూడ్ ఫొటోషూట్‌పై రణ్‌వీర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ నాకు తెలిసింది. అసౌకర్యంగా ఫీలయ్యా అన్నారు కానీ అలా జనాలు అనుకున్నారు’’ అని చెప్పుకొచ్చారు.


Similar News