ప్రముఖ నటి మృతి వెనుక లవ్ జిహాద్..? BJP ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
ప్రముఖ టీవి నటి తునీషా శర్మ శనివారం ఓ సీరియల్ సెట్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టీవి నటి తునీషా శర్మ శనివారం ఓ సీరియల్ సెట్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. బాలీవుడ్ బుల్లితెర పరిశ్రమలో విషాదం నింపిన తునీషా ఆత్మహత్యపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీరియల్ సెట్‌లో ఆత్మహత్యకు పాల్పడిన యువనటి తునీషా శర్మ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని.. నటి ఆత్మహత్యకు గల కారణాలపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుగుతోందని ఎమ్మెల్యే రామ్ కదమ్ తెలిపారు. తునీషా ఆత్మహత్య వెనుక లవ్ జిహాద్ కానీ.. బ్లాక్ మెయిలింగ్ జరిగిందా అన్నా కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారని పేర్కొన్నారు. ఒకవేళ నటి ఆత్మహత్యకు లవ్ జిహాద్ కారణమైతే.. ఈ లవ్ జిహాద్ వెనుక ఏ సంస్థలు ఉన్నాయి.. అసలు కుట్రదారులు ఎవరు..? అనే అంశాలను పోలీసులు బయట పెడుతారని చెప్పారు.
ఈ కేసులో తునీషా కుటుంబ సభ్యులకు నూటికి నూరు శాతం న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే రామ్ కదమ్ హామీ ఇచ్చారు. ఇక, తునీషా ఆత్మహత్యకు ఆమె ప్రియుడు, సహ నటుడు షీజన్ మహమ్మద్ ఖాన్ కారణం అని మృతురాలు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు షీజన్ మహమ్మద్ ఖాన్‌ను అరెస్ట్ చేసి విచారించారు. దర్యాప్తు అనంతరం తునీషా శర్మ ఆత్మహత్య వెనుక లవ్ జిహాద్ లేదని పోలీసులు స్పష్టం చేశారు. తునీషా, షీజన్‌ల మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని.. 15 రోజుల క్రితం వారికి బ్రేకప్ అయ్యిందని వెల్లడించారు. నటి తునీషా ఆత్మహత్య వెనుక బ్లాక్ మెయిల్, లవ్ జిహాద్, ఇంకా మరే ఇతర ఎఫైర్ కానీ లేదని పోలీసులు వెల్లడించారు.
READ MORE