దిశ, సినిమా : ప్రఖ్యాత గాయని సులోచన చవాన్ (92) శనివారం ముంబయిలో కన్నుమూశారు. ఈ ఏడాది ప్రారంభంలో చవాన్‌కు పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. ఇక ఆమె చేసిన కృషికి 'లావణి సమ్రాడ్ని' (లావణి రాణి) అనే బిరుదు కూడా లభించింది. ఆమె పాడిన పాటల్లో 'ఔండా లాగిన్ కరాచైన్.. కసన్ కే పాటిల్ బరన్ హీకా', 'కలిదర్ కపురి పాన్', 'ఖేలతన్ రంగ్ బాయి హోలిచా', 'పదారవర్తి జర్తారిచి మోర్ నచ్రా హవా' లాంటి గీతాలు భారీ ప్రజాదరణ పొందాయి. ఇక చవాన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ కూడా సంతాపం వ్యక్తం చేశాడు. 'మహారాష్ట్ర సంస్కృతిని, ముఖ్యంగా లావనిని ప్రోత్సహించడంలో ఆమె చేసిన స్మారక పాత్రకు రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయి. ఆమె సంగీతం ఎంతోమందిని ఆకట్టుకుంది. ఆమె మృతిచెందడంపట్ల నేను చాలా బాధపడుతున్నా. ఓం శాంతి' అని మోడీ ట్వీట్ చేశాడు.
The coming generations will remember Sulochana Tai Chavan for her monumental role in promoting the culture of Maharashtra, especially Lavani. She was also passionate about music and theatre. Pained by her demise. Condolences to her family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) December 10, 2022Read More....