నేను తలచుకుంటే పక్కలో పడుకోవడానికి స్టార్ హీరోయిన్లు సైతం రెడీ: స్టార్ హీరో సంచలన కామెంట్స్

తమిళంలో స్టార్ హీరోగా రాణించిన హీరో సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-03-01 11:48 GMT

దిశ, సినిమా: తమిళంలో స్టార్ హీరోగా రాణించిన హీరో సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తర్వాత తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఉత్తమ నటుడిగా పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నాడు. 1990 లో సౌత్ ఇండియాలోనే సుమన్ స్టార్ హీరోగా నిలదోక్కుకున్నాడు. ఇప్పటికీ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాడు.

అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడిగా రాజ్యాన్ని ఏలేసిన సుమన్, తన కెరీర్‌లో కొన్ని నిందలు కూడా మోయాల్సి వచ్చింది. కెరీర్‌లో మంచి పేరు సంపాదించుకుంటోన్న క్రమంలోనే ఈ హీరోపై చెత్త వార్తలు క్రియేట్ అయ్యాయి. తాజాగా సుమన్ ఓ ఇంటర్వ్యూకు హాజరై ఆ ఇష్యూస్ గురించి బయటపెట్టాడు. ‘‘నాపై తప్పుడు కేసు వేసిన వాళ్లందరూ చాలా బలవంతులు అయినప్పటికీ అలాంటి టైంలో నేను చాలా మంచి వ్యక్తిని అని సుమలత, భానుప్రియ, సుహాసిని నాకోసం ముందుకు వచ్చే మాట్లాడారు.

నాకు వారు సపోర్ట్ చేయడం బాగా నచ్చింది. ఆ టైంలో వారు నాకిచ్చిన మద్దతు, వారి ధైర్యానికి ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే నాకు తెలుగు మీడియా కూడా బాగా సపోర్ట్ చేసింది. నేను తలుచుకుంటే అగ్ర హీరోయిన్లు సైతం నా పక్కలో పడుకోవడానికి వస్తారని, కానీ సుమన్‌కు అలాంటి అవసరం లేదని నా అసలు క్యారెక్టర్ బయటపెడ్డింది అని ఎవరో గిట్టని వాళ్లే నాపై ఇలా నిందలు వేశారు. అంటూ హీరో సుమన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సుమన్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.


Similar News