Sweety Naughty Crazy: లవ్ అండ్ కామెడీ చిత్రం.. క్లాప్ కొట్టిన సీనియర్ నటుడు అలీ

త్రిగుణ్, శ్రీజిత ఘోష్ జంటగా నటిస్తున్న సినిమా ‘స్వీటీ నాటీ క్రేజీ’.

Update: 2024-08-07 14:14 GMT

దిశ, సినిమా: త్రిగుణ్, శ్రీజిత ఘోష్ జంటగా నటిస్తున్న సినిమా ‘స్వీటీ నాటీ క్రేజీ’. రాజశేఖర్.జి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని అరుణ్ విజువల్స్ బ్యానర్‌పై ఆర్. అరుణ్ నిర్మిస్తున్నాడు. ఇనయ, రాధ, అలీ, రఘుబాబు, రవి తదితరులు ముఖ్య పాత్రల్లో నిటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ముహూర్తపు సన్నివేశానికి అలీ క్లాప్ కొట్టగా.. దామోదర ప్రసాద్ స్క్రిప్ట్ అందజేయగా.. బెక్కెం వేణు గోపాల్ దర్శకత్వం వహించారు. అనంతరం మీడియాతో ముచ్చటించారు చిత్ర బృందం. ఈ సందర్భంగా హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. ‘శ్రీజిత, ఇనియలకు ఇందులో మంచి పాత్రలుంటాయి. టైటిల్‌కు తగ్గట్టుగా.. స్వీటీ, నాటీ, క్రేజీలా ఉంటాయి. నాకు ఇంత వరకు కామెడీ చిత్రాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ‘కథ’తో మొదలైన నా ప్రయాణానికి మీడియా సపోర్ట్ అందించింది’ అని అన్నారు. దర్శకుడు రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘సినిమా పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుంది. అందరినీ నవ్వించేలా ఉంటుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, కామెడీ యాంగిల్‌లో సినిమా ఉంటుంది’ అని అన్నారు.

Tags:    

Similar News