‘ఏ వతన్ మేరే వతన్’పై సారా ఎమోషనల్.. పోస్ట్ వైరల్

‘ఏ వతన్ మేరే వతన్’లో తనకు అవకాశం కల్పించడంపై సారా అలీఖాన్ హ్యాపీగా ఫీల్ అవుతోంది.

Update: 2023-05-02 08:13 GMT
‘ఏ వతన్ మేరే వతన్’పై సారా ఎమోషనల్.. పోస్ట్ వైరల్
  • whatsapp icon

దిశ, సినిమా: ‘ఏ వతన్ మేరే వతన్’లో తనకు అవకాశం కల్పించడంపై సారా అలీఖాన్ హ్యాపీగా ఫీల్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా రాబోతున్న ఈ మూవీలో శక్తివంతమైన పాత్రకు తనను ఎంచుకున్నందుకు దర్శకుడు కన్నన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు సెట్‌లో డైరెక్టర్‌తో రిక్షాలో కూర్చుని దిగిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేస్తూ.. ‘బలం, గౌరవం, అభిరుచి, నిజమైన వ్యక్తిత్వం.. కొన్ని భాగాలు మన ఆత్మలో మమేకమై ఉంటాయి. ‘ఏ వతన్ మేరే వతన్’ ఎమోషన్‌ను, మహాత్మా గాంధీ సిద్ధాంతాన్ని ఎప్పటికీ నాతోపాటు మోసుకెళ్తాను. జై భోలేనాథ్’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. మూవీనుంచి ఇటీవల విడుదలచేసిన సారా గ్లింప్స్ మూవీపై భారీ అంచనాలు పెంచేశాయి.


Tags:    

Similar News