నా కూతురు అలా తయారవడానికి కారణం నేనే.. సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ కపూర్
దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ కపూర్.. తన కూతురు షనయ కపూర్ తెలివితేటలపై ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు షనయా స్టార్‌కిడ్ గానే ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ తనకంటూ కొన్ని ప్రత్యేకతలున్నాయని, పరిశ్రమలో ఎదురయ్యే కష్టాలపై పూర్తి అవగాహన ఉందని చెప్పాడు. ‘నా కూతురుకు సినీ పరిశ్రమలో ఎదురయ్యే ఒడిదొడుకుల గురించి బాగా తెలుసు. అన్నింటినీ అర్థం చేసుకుంటుంది. ఈ విషయంలో మేము ఆమె పై ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ, దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా ప్రయాణాన్ని ఆమె దగ్గరి నుంచి చూసింది. నేను ఎలా నడుచుకున్నానో, ఎలా పనిచేశానో గమనించింది. ఇక ఇంతకంటే గొప్ప పాఠం ఏమీ ఉండదు. దీన్ని స్టార్స్ పిల్లలంతా అర్థం చేసుకోలేకపోతే మనం ఎంత చెప్పినా ప్రయోజనం ఏముంటుంది’ అన్నాడు. చివరగా ఈ ఫీల్డ్‌లోకి వచ్చేవాళ్లకు కమిట్ మెంట్ చాలా అవరసరమని చెప్పిన సంజయ్.. నేటి యువతరం మరో 30-40 ఏళ్లపాటు సినీ పరిశ్రమలో ఎలా జీవించబోతున్నారనే విషయంలో ఆసక్తిగానే ఉందని చెప్పాడు.
Read More: అలాంటి డ్రెస్‌లో మెరిసిన తమన్నా.. విజయ్ నాటీ కామెంట్స్ వైరల్