సమంత ‘శాకుంతలం’ సినిమా నాగచైతన్య వల్లే ఫ్లాప్ అయ్యింది: బిగ్ బాస్ బ్యూటీ
టాలీవుడ్ స్టార్ సమంత ‘ఏ మాయ చేసావే’ సినిమాతో నాగచైతన్య ప్రేమలో పడిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ సమంత ‘ఏ మాయ చేసావే’ సినిమాతో నాగచైతన్య ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏదో కారణం వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం సమంత, నాగచైతన్య వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే సమంత, డైరెక్టర్ గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘శాకుంతలం’. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలై నెగిటివ్ టాక్‌కు సొంతం చేసుకుంది. దీంతో సమంత పలు విమర్శలను ఎదుర్కొంది. తాజాగా, శాకుంతలం సినిమాపై బిగ్ బాస్ బ్యూటీ ఆరోహి రావ్ తన ఇన్‌స్టా స్టోరీలో సంచలన పోస్ట్ చేసింది. ‘‘ శాకుంతలం చిత్రం కొంచెం లాగ్ ఉండటం నిజమే. పురాణాల గురించి తెలియని వారికి ఈ సినిమా పంచతంత్రం కథలాగే కనిపిస్తుంది. ఈ చిత్రం ఫ్లాప్ అవ్వడానికి నాగ చైతన్య ఫ్యాన్స్ కూడా ఒక కారణం. సమంత నటన బాగా లేదని చెప్పిన వారు కచ్చితంగా నాగ చైతన్య అభిమానులే. ఉన్నది ఉన్నట్టుగా తీశారు. కొంచెం ఫిక్షన్, మసాలా జోడిస్తే ఈ మూవీని చూసేవాళ్లు. ఇక అల్లు అర్హ బాగా చేసింది. కానీ అంతకంటే చాలా బాగా చేసే చైల్డ్ ఆర్టిస్టులు బయట అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ‘శాకుంతలం’ యావరేజ్ సినిమా ఫ్లాప్ అయితే కాదు’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆరోహి రావ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.