కన్నీరు పెడుతూ.. ఐస్ బాత్లో Samantha..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే స్టార్ హోదా సంపాదించుకుంది. ఇక సామ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి
దిశ, వెబ్డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే స్టార్ హోదా సంపాదించుకుంది. ఇక సామ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి , వెకేషన్ ఏంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇండోనేషియాలోని బాలి దీవికి విహార యాత్రకు వెళ్లి, అక్కడ తన స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతోంది. తాజాగా సామ్ తన ఇన్ స్టాలో ఐస్ బాత్ టబ్ అంటూ వీడియోను షేర్ చేసింది.
‘ఐస్ బాత్స్, ఫోర్ డిగ్రీస్, సిక్స్ మినిట్స్’ అంటూ.. ఆరు నిమిషాల పాటు ఆ ఐస్ నీళ్లలో కఠినంగా కూర్చొని ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఆమె కళ్ల నుంచి కన్నీళ్లు కూడా వస్తున్నట్టు కనిపించంది. అయితే ఇదొక థెరపీ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Also Read: పెళ్లికాకుండానే తల్లికాబోతున్న నటి.. బేబీ బంప్ చూపిస్తూ..