అందుకే ప్రీతమ్‌ను సామ్ దూరం పెట్టిందా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్న డిప్రెషన్ నుంచి బయటపడేందుకు చాలా ఇబ్బంది పడ్డారు.
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్న డిప్రెషన్ నుంచి బయటపడేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. ఎక్కువ సమయం మిత్రులు, సన్నిహితులతో గడిపింది. అందులో సాధన, ప్రీతమ్ వీరిద్దరితో సామ్ చాలా క్లోజ్ అయింది. ప్రీతమ్ సమంత స్టైలిస్ట్ కాగా.. సాధన మేకప్ ఆర్టిస్ట్. వీరిద్దరితో కలిసి సమంత టూర్లు, పలు వెకేషన్లకు కూడా వెళ్లింది. అయితే అదే సమయంలో సమంత-ప్రీతమ్ మధ్య ఎఫైర్ ఉందని, ఆ కారణంతోనే నాగ చైతన్యతో విడాకులు తీసుకుందనే వార్తలు వెలువడ్డాయి.
ఈ రూమర్స్ తట్టుకోలేక ప్రీతమ్ 'ఆమెను నేను అక్కలా భావిస్తాను. అపార్థం చేసుకోకండి' అని వేడుకున్నాడు. దీంతో ఎన్ని పుకార్లు వినిపించినా ప్రీతమ్‌ను సామ్ దూరం పెట్టలేదు. అయితే తాజాగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నట్లు, టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. మరికొందరూ మాత్రం అనారోగ్యం, షూటింగ్ షెడ్యూల్ కారణంగా మిత్రులను కలిసే టైమ్ సామ్‌కు దొరకడం లేదంటున్నారు.