South Korea వెళుతున్న Samantha.. ఎందుకో తెలుసా?

మయోసైటిస్' వ్యాధితో బాధపడుతున్న సమంత.. ట్రీట్‌మెంట్‌ కోసం సౌత్‌ కొరియా వెళుతున్నట్లు తెలుస్తోంది.

Update: 2022-11-30 12:02 GMT

దిశ, సినిమా: 'మయోసైటిస్' వ్యాధితో బాధపడుతున్న సమంత.. ట్రీట్‌మెంట్‌ కోసం సౌత్‌ కొరియా వెళుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, మళ్లీ ఆస్పత్రిలో చెరినట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. దీంతో అలాంటిదేమీ లేదని చెబుతూ ఓ ఇంటర్య్వూలో స్పష్టం చేసింది. ఇదిలావుంటే.. మరోసారి సమంతకు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అడ్వాన్స్‌ ట్రీట్‌మెంట్‌లో భాగంగా సామ్ సౌత్‌ కొరియా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నెల రోజుల పాటు అక్కడే ఉండనుందని, ఈ చికిత్స పూర్తికాగానే ఇండియా వచ్చి 'ఖుషీ' సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇక దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇవి కూడా చదవండి : భార్యను కాదని పెళ్లి కాని యువతితో రొమాన్స్.. అందరిముందే అలా..!

Tags:    

Similar News