సమంత మరో ఎమోషనల్ పోస్ట్.. అందరికోసం అంటూ..

టాలీవుడ్ నటి సమంత మరో ఎమోషనల్ పోస్టుతో వార్తల్లో నిలిచింది.

Update: 2022-12-25 12:12 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ నటి సమంత మరో ఎమోషనల్ పోస్టుతో వార్తల్లో నిలిచింది. కొంతకాలంగా మయోసైటిస్‌ వ్యాధితో పోరాడుతున్న ఆమెకు ఎంతోమంది అభిమానులు, సెలబ్రిటీలు మద్ధతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే నటుడు రాహుల్ రవీంద్రన్ సమంతను ఉక్కు మనిషిగా పేర్కొంటూ తాజాగా నెట్టింట ఓ నోట్ షేర్ చేశాడు. 'ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎంతటి సమస్యలు ఎదురైనా.. నీవు పోరాడుతూనే ఉన్నావ్. ఇంకా ఫైట్ చేస్తూనే ఉంటావ్. ఎందుకంటే నీవు ఉక్కు మహిళవి. నిన్ను ఏదీ ఓడించ లేదు. బాధ పెట్టలేదు. పైగా అవన్నీ నిన్ను మరింత స్ట్రాంగ్‌గా చేస్తుంటాయి' అని మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు. అయితే దీనిపై స్పందించిన సామ్.. 'థాంక్యూ రాహుల్.. బయట ఎవరైతే తమ జీవితాలతో పోరాడుతున్నారో వారందరి కోసం ఇది చెబుతున్నా. పోరాడుతూనే ఉండండి. ఇంకా మీరు బలంగా తయారవుతారు. మరింత ధృడంగా మారి కష్టాలను ఎదురిస్తారు' అని తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

READ MORE

ప్రముఖ నటి మృతి వెనుక లవ్ జిహాద్..? BJP ఎమ్మెల్యే సంచలన కామెంట్స్ 

Full View
Tags:    

Similar News