సమంతతో ఏకాంతంగా ఉన్న అతడు ఎవరు..? తోడు వెతుక్కుందా అంటూ కామెంట్స్
స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ఏమాయ చేశావే’ సినిమా తర్వాత’ సామ్, నాగచైతన్య ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ఏమాయ చేశావే’ సినిమా తర్వాత’ సామ్, నాగచైతన్య ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ఇప్పుడు వీరిద్దరూ సెపరేట్‌గా ఉంటూ ఎవరి లైఫ్‌పై వారు ఫోకస్ పెట్టి వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సమంత వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే సామ్, వరుణ్ ధావన్ సిటాడెల్ షూటింగ్ కోసం సెర్బియా దేశంకు వెళ్లిన సంగతి తెలిసిందే.
అక్కడ షూటింగ్ సమయం తర్వాత ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సామ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది. తాజాగా, సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ అమ్మడు ఓ వ్యక్తితో ఏకాంతంగా ఉన్న ఫోటో షేర్ చేసింది. అంతేకాకుండా ఈ పోస్ట్‌కు హార్ట్ సింబల్ పెట్టి మరీ లవ్మూడ్ అనే క్యాప్షన్‌ను జత చేసింది. అందులో అతని ఫేస్ కనిపించకపోవడంతో ఆయన ఎవరని నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. దీంతో సింగిల్‌గా ఉన్న సమంత తోడు వెతుక్కుందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. కానీ ఆమె ఫ్యాన్స్ మాత్రం వాటన్నిటీని కొట్టిపారేస్తూ అతడు సిటాడెల్ డైరెక్టర్ రాజ్ డీకే అంటూ షూటింగ్ సెట్లో ఇద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారని అంటున్నారు.
Also Read: లావణ్యతో వరుణ్ ప్రేమ, పెళ్లి ఆమె కోట్ల ఆస్తి కోసమేనా..?