Samantha: రాత్రుళ్లు గ్యాప్ లేకుండా ఆ పని చేస్తున్న సమంత!
సమంత అనారోగ్యం కారణంగా ఆగిపోయిన సినిమాలన్ని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుందట.
దిశ, వెబ్ డెస్క్ : సమంత అనారోగ్యం కారణంగా ఆగిపోయిన సినిమాలన్ని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుందట. రాజ్ అండ్ డీకే చిత్రీకరిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్లో సమంత జాయిన్ అయ్యారు . ప్రస్తుతం ఈమె నైనిటాల్లో సమంత ఉంది. అక్కడ సమంత కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను చేసేందుకు సిద్ధమవుతోందట. నైనిటాల్లో ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత ఉందట.. అక్కడ కూడా సమంత గ్యాప్ లేకుండా వర్కౌట్లు చేస్తుందట. ఈ వెబ్ సిరీస్ పూర్తయ్యాక.. విజయ్ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతుందట. ఇప్పుడు సమంత చాలా యాక్టీవ్ గా కనిపిస్తుంది. మయోసైటిస్ వ్యాధి కారణంగా కొన్నాళ్ళు ఇంటి దగ్గరే ఉండి పోవాలిసివచ్చింది. సమంత కోలుకుంటుందని తెలుస్తుంది.