నిన్ను ఎవరూ మ్యాచ్ చేయలేరు.. స్టార్ హీరోపై సమంత ప్రశంసలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’.

Update: 2024-10-01 09:19 GMT

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో కియారా అద్వాని హీరోయిన్ కాగా.. అంజ‌లి, సముద్రఖ‌ని, ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, జయరాం, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీమ‌తి అనిత స‌మ‌ర్పణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్షన్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్నారు. 2024 క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న ‘గేమ్ చేంజర్’ తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు చిత్ర బృందం. రిలీజ్ సమయం దగ్గర పడటంతో వరుస అప్‌డేట్స్‌తో సందడి చేస్తున్నారు చిత్ర బృందం.

ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి ‘రా మచ్చా.. మచ్చా’ ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సాంగ్‌లో కొన్ని స్టెప్పులను రామ్ చరణ్ షేర్ చేస్తూ.. ‘#RaaMachaMacha​ ఇప్పుడు ఈ సాంగ్ మీదే. ఈ భారీ పాటను నేను ఆనందించినట్లు.. మీరు కూడా ఆనందిస్తున్నారని ఆశిస్తున్నాను’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్‌పై స్పందించిన సమంత.. నిన్ను ఎవరూ మ్యాచ్ చేయలేరు అనే మీనింగ్ వచ్చేలా ‘అన్‌మ్యాచ్‌బుల్’ అనే కామెంట్ పెట్టింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


Similar News