కష్టాల్లో దగ్గరై నాలో స్ఫూర్తి నింపినందుకు ధన్యవాదాలు: సామ్ పోస్ట్ వైరల్!
స్టార్ నటి సమంత మరో బ్యూటిఫుల్ పోస్ట్‌తో నెట్టింట దర్శనమిచ్చింది.
దిశ, సినిమా: స్టార్ నటి సమంత మరో బ్యూటిఫుల్ పోస్ట్‌తో నెట్టింట దర్శనమిచ్చింది. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ 'సిటాడెల్' కోసం కష్టపడుతున్న సామ్ తాజాగా జిమ్‌లో పుల్ అప్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. 'కష్టమైన రోజుల్లో నాకు దగ్గరై, నాలో స్ఫూర్తి నింపిన 'హూ ఈజ్ గ్రావిటీ' బ్యాండ్‌కు ధన్యవాదాలు. స్ట్రిక్టెస్ట్ పాజిబుల్ డైట్లో ఉన్న నేను నేర్చుకుందేంటంటే.. బలం అనేది మనం ఏం తింటున్నామనే దానిలో ఉండదు. మనం ఏం ఆలోచిస్తున్నామనే దానిపై ఆధారపడుతుంది' అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోపై అభిమానులు తమదైన స్టైల్లో స్పందిస్తుండగా సామ్‌కు మరింత బలం చేకూరాలని కోరుకున్న డైరెక్టర్ నందిని రెడ్డి.. 'ఇలాంటి పుల్ అప్స్ నేను ఒంటి చేత్తో చేశాను. నువ్వు ఫీల్ అవుతావని వీడియో పోస్ట్ చేయట్లేదు' అంటూ ఫన్నీగా రియాక్ట్ అయింది.