Shobhita Dulipala:సమంత నా సోల్‌మేట్.. ఆమెను అలా చూసినప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి: శోభిత

యంగ్ బ్యూటీ శోభిత దూళిపాళ ఇటీవల అక్కినేని హీరో నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది.

Update: 2024-10-06 08:38 GMT

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శోభిత దూళిపాళ ఇటీవల అక్కినేని హీరో నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న వారు పెద్దలను ఒప్పించి ఆగస్టు 8న నిశ్చితార్థంతో తమ బంధాన్ని అధికారికంగా వెల్లడించారు. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను అక్కినేని నాగార్జున ‘X’ వేదికగా షేర్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక అప్పటి నుంచి శోభిత పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. అంతేకాకుండా ఆమె ఏం మాట్లాడినా ఏ పోస్ట్ పెట్టినా నిమిషాల్లో వైరల్ అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. అయితే తొందరలోనే శోభిత అక్కినేని నాగచైతన్య డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు టాక్. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నా చెల్లి సమంత నా సోల్‌మేట్‌. ఈ మధ్యే తన పెళ్లి అయింది. అందంగా ముస్తాబై మండపంలో కూర్చున్న నా చెల్లిని చూసినప్పుడు ఆనందంతో కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తన పెళ్లి కారణంగానే నేను మా బంధువులనంతా కలుసుకున్నాను.

కెరీర్‌లో బీజీగా ఉండడం కారణంగా ఇన్నాళ్లు వారిని దూరమైపోయాను. ఇకపై పర్సనల్‌ లైఫ్‌కి కూడా సమయం కేటాయిస్తాను. అయితే నాకు చిన్నప్పటి నుంచి అమ్మ కావాలనే కోరిక ఉండేది. అమ్మా అని పిలిపించుకోవడం ఆ మాధుర్యం నాకు అద్భుతంగా అనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చింది. అయితే అంతా టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నాగచైతన్య మాజీ భార్య సమంత గురించని అనుకుంటున్నారు.

Read More..

Nikhil Siddhartha: విడుదలకు సిద్ధమైన నిఖిల్ కొత్త సినిమా.. షాక్‌లో ఫ్యాన్స్ (పోస్ట్) 


Similar News