పింక్ కలర్ శారీలో పిచ్చెక్కించిన సమంత.. ఆ అందాలను తెగ పొగిడేస్తున్న ఫ్యాన్స్

స్టార్ నటి సమంత బ్యూటీఫుల్ లుక్‌లో దర్శనమిచ్చి అభిమానులను అట్రాక్ట్ చేసింది.

Update: 2023-10-08 12:58 GMT

దిశ, సినిమా: స్టార్ నటి సమంత బ్యూటీఫుల్ లుక్‌లో దర్శనమిచ్చి అభిమానులను అట్రాక్ట్ చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఆమె తాజాగా పింక్ కలర్ శారీలో మిరుమిట్లు గొలుపుతూ అలరించింది. ఈ మేరకు దుబాయ్‌లో ‘Nishka Jewellery Shop’ ప్రారంభోత్సవానికి హాజరైన నటి అక్కడ సరికొత్త లుక్‌లో కనిపించి సందడి చేసింది. కంప్లీట్‌ పింక్‌ కలర్‌ సంప్రదాయ వస్త్రధారణలో హొయలుపోతూ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. సమంత గులాబీ రంగు చీరలో గుబాలిస్తున్నట్టుగా ఉన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట ట్రెండింగ్ అవుతుంటే ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ‘ఎల్లప్పుడూ నిన్ను ఇలాగే చూడాలనుకుంటున్నాం’ అంటూ ఆమె అందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సమంత ప్రస్తుతం వరుణ్ ధవన్‌తో అమెజాన్ ప్రైమ్ సిరీస్‌ ‘Citadel’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News