సమంతను ఒక అమ్మలా సంరక్షిస్తా: Rashmika Mandanna
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది రష్మిక
దిశ, సినిమా: తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది రష్మిక. ఈ క్రమంలోనే రష్మిక నటించిన 'వారిసు' మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన రష్మిక పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
'సమంత ఒక అద్భుతమైన మహిళ. దయ కలిగిన అందమైన వ్యక్తి. నేను తనని ఒక అమ్మ లాగా ఎప్పుడు సంరక్షించాలని అనుకుంటున్నా. మయోసైటీస్ గురించి ఆమె ప్రకటించిన తర్వాతనే నాకు తెలిసింది. అంతవరకు ఆమెకు మయోసైటిస్ ఉందని తెలియదు. ఎప్పుడు క్యాజువల్‌గా కూడా ఆ విషయం గురించి నాతో చర్చించలేదు. సామ్ కచ్చితంగా కొలుకుంటుంది' అని చెప్పుకొచ్చింది రష్మిక.
బ్రేకప్ తర్వాత ప్రతి మహిళ ఇలాగే చేయాలి: తారా ప్రవర్తన పై నెటిజన్ల చర్చ