SAMANTHA: మిడిల్ ఫింగర్ చూపిస్తూ నాగ చైతన్యకు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన సమంత.. నెట్టింట దుమారం రేపుతోన్న పోస్ట్?

నాగ చైతన్య-శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్‌తో సమంతపై మొదలైన ట్రోలింగ్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.

Update: 2024-08-15 08:28 GMT

దిశ, సినిమా: నాగ చైతన్య-శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్‌తో సమంతపై మొదలైన ట్రోలింగ్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఏమాయ చేశావే చిత్రంతో ఒక్కటైన నాగ చైతన్య-సమంత ప్రేమలో పడి.. పెద్దల సమక్షంలో చరిత్రలో నిలిచిపోయేలా అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇప్పటికీ సామ్-చై పెళ్లి ఫొటోలు చూస్తే ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. అంత క్యూట్‌గా ఉంటుంది మరీ వీరి జంట. కానీ వీరి బంధం కొన్నాళ్లకే ముగింపు పలికింది.

కారణమేంటో తెలియనప్పటికీ సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు. ఇటీవలే నాగ చైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకున్నారు. చైతూ మరో పెళ్లికి సిద్ధమవ్వగా.. సామ్‌ను నెట్టింట్లోకి లాగి ప్రతి చిన్న విషయానికి అంటపెట్టి ట్రోల్ చేస్తున్నారు. తాజాగా సమంత సోషల్ మీడియాలో ఓ పెట్టింది. దీన్ని కూడా జనాలు వదలకుండా ఆ పోస్ట్‌పై తీవ్ర చర్చ మొదలుపెట్టారు. ఇందులో సామ్ తలకు చేయి ఆనించిన ఓ ఫొటో పంచుకుంది.

ఆ ఫొటోలో సామ్ ధరించిన టీషర్ట్‌ పై ‘ది మ్యూజియం ఆఫ్ పీస్ అండ్ క్వయిట్’ అని రాసి ఉంది. దీంతో జనాలు కుదురుగా ఉంటారా? నాగ చైతన్యకు కావాలనే సమంత మిడిల్ ఫింగర్ చూపిస్తూ కౌంటర్ ఇచ్చిందని అంటున్నారు. అలాగే డైరెక్టర్ రాజుతో రిలేషన్‌లో ఉన్నానని వస్తోన్న వార్తలపై ఏమని స్పందించాలో అర్థం కాక ఈ జనాలకు ఈ రకంగా చెబితేనే అర్థమవుతుందని ఫింగర్ అలా చూపిస్తూ పోస్ట్ పెట్టారని నానా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Full View


Similar News