SAMANTHA: ‘న్యాయం చేయండి’.. హార్ట్ బ్రేక్ సింబల్ జోడించి సమంత ఎమోషనల్ పోస్ట్

వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్. జి కర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే.

Update: 2024-08-16 06:09 GMT

దిశ, సినిమా: వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్. జి కర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై ప్రముఖ రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలు స్పందించి విచారం వ్యక్తం చేయడంతో పాటు బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ ఘటనపై స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికన ఓ స్టోరీ రాసుకొచ్చింది. అందులో జూనియర్ డాక్టర్‌కు న్యాయం చేయాలని కోరింది. అంతేకాకుండా ఈ ఘటనపై ఎమోషనల్ అవుతూ హార్ట్ బ్రేక్ సింబల్ జోడించి సంతాపం వ్యక్తం చేసింది.

హీరోయిన్ సమంత విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. సమంత చివరగా నటించిన సినిమాలు కూడా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇకపోతే నాగ చైతన్య-శోభితా ధూళ్లపాళ్ల నిశ్చితార్థం చేసుకోవడంతో సమంత సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ కు గురవుతుంది. నెట్టింట సామ్ ఏ పోస్ట్ పెట్టిన తెగ వైరల్ అవుతోంది. అలాగే ఈ హీరోయిన్ కూడా ఓ డైరెక్టర్ ను పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో అదే వార్త ట్రెండింగ్ లో ఉంది.

 

 

 

 

 

Tags:    

Similar News