బజార్‌పై సమంత.. మరీ ఇంత దారుణంగా చూసేసరికి హర్ట్ అవుతున్న ఫ్యాన్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే.

Update: 2023-11-09 08:28 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టిపెట్టింది. ట్రీట్మెంట్‌లో భాగంగా భూటాన్‌లో ఉన్న సామ్.. తాజాగా ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ బజార్‌పై దర్శనమిచ్చింది. బ్లాక్ డిజైనర్ అవుట్ ఫిట్‌లో సమంతను సూపర్ హాట్‌గా ప్రజెంట్ చేశారు. అయితే ఈ ఫొటోషూట్‌లో బౌండరీలు బ్రేక్ చేసిన బ్యూటీని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. గతంలో ఎన్నడూ కనిపించనంత హాట్‌గా బికినీని తలపిస్తున్న డ్రెస్‌లో చెమటలు పట్టిస్తుంది. దీంతో ఫ్యాన్స్ మేము చూసేది సమంతనేనా అంటూ బాధపడుతున్నారు.

అయితే ఈ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత మొదటి సారిగా తన జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. మీ జీవితంలో ఎదురైన ఒడిదుడుకులపై స్పందన ఏంటని అడగ్గా... ‘జీవితంలో అన్నింటి కంటే ముఖ్యమైనది వివాహం. అది నా లైఫ్‌లో ముగిసిపోయింది. మరోవైపు నా ఆరోగ్యం దెబ్బతినడం.. నేను నటించిన సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించక పోవడంతో వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఈ సమస్యలన్నింటితో సుమారు రెండేళ్ల నుంచి జీవితంలో ఎంతో కుంగిపోతున్నాను. ఆ సమయంలో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని తిరిగి నిలదొక్కుకున్న నటుల గురించి చదివాను. వారి నుంచి ధైర్యంగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. ఒక నటిగా నా కర్తవ్యాన్ని నేను ఎంతో నిజాయితీగా నిర్వర్తిస్తున్నాను. ఈ ఇండస్ర్టీలోని నటీనటుల జీవితాల్లో సినిమా, అవార్డులు, వారు ధరించే దుస్తులు మాత్రమే కాదు.. వారికి కూడా తెర వెనకాల ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయి. కాబట్టి నా ఇబ్బందులు నేను చెప్పుకుంటే కొంత బాధ తగ్గుతుంది. ఇక్కడ నాలా ఇబ్బందులు పడే వారు ఎందరో ఉన్నారు. వారందరు కూడా నాలాగే పోరాడాలని ఆశిస్తున్నాను’ అని సూచించింది సామ్. 

Full View

Tags:    

Similar News