ఆ హీరోయిన్ను గాఢంగా ప్రేమించిన సల్మాన్ ఖాన్..
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు.
దిశ, సినిమా: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇక ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే సల్మాన్ పేరు ముందుంటుంది. అయితే తాజాగా సల్మాన్‌కు సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చింది. హీరోగా సినీ రంగంలో అడుగుపెట్టిన మొదట్లో సల్మాన్ ఓ హీరోయిన్ మనస్ఫూర్తిగా ప్రేమించారంట. ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. ధైర్యం చేసి తన ప్రేమ విషయాన్ని నేరుగా ఆ హీరోయిన్ పేరెంట్స్‌తో చెప్పినప్పటికీ.. ఆమె తండ్రి పెళ్లికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇందుకు కారణం సల్మాన్ అప్పటికి మంచి పొజిషన్లో లేక పోవడమే. అలా సల్మాన్ జీవితంలో లవ్ మ్యారేజ్ కొద్దిలో తప్పిపోయింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే ఇప్పటికే బాలీవుడ్లో చక్రం తిప్పేసిన సీనియర్ హీరోయిన్ జూహీ చావ్లా అని టాక్.
Also Read...
‘పుట్టింటి పరువు తీస్తున్న నిహారిక..’ సోషల్ మీడియాలో ట్రోల్స్