నా బాడీలో ఏ పార్ట్‌ను వదల్లేదు.. అన్ని సైజులపై వల్గర్ కామెంట్స్ చేశారు..
18 ఏళ్ల వయసులోనే తన బాడీ షేపుల గురించి వల్గర్ కామెంట్స్ ఎదుర్కొన్నానంటోంది సయామీ ఖేర్.
దిశ, సినిమా: 18 ఏళ్ల వయసులోనే తన బాడీ షేపుల గురించి వల్గర్ కామెంట్స్ ఎదుర్కొన్నానంటోంది సయామీ ఖేర్. అభిషేక్ బచ్చన్ సరసన ఆమె నటించిన ‘ఘూమర్’ మూవీ ఆగస్టు 18న రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు ప్రచారంలో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొంటున్న నటి.. తన లిప్, నోస్, బూబ్స్ సైజులు సరిగా లేవని, అవకాశాలు రావాలంటే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమని కొంతమంది సలహాలు ఇచ్చినట్లు తెలిపింది.
ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన ఓ యువకుడు తాను పరిశ్రమ నిర్దేశించిన నిబంధనలకు సరిపోనని.. తప్పుడు కామెంట్స్ చేశాడని గుర్తుచేసుకుంది. అయితే చాలా కాలంగా వినోద పరిశ్రమను పట్టి పీడిస్తున్న ఈ బ్యూటీ కొలతల ఇష్యూ ఇకనైనా పూర్తిగా అదృశ్యమవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. ‘ఇతరుల అందం గురించి కామెంట్స్ చేయడం చాలా తప్పు. దీన్ని సమాజం ఎన్నడూ అంగీకరించదు. అయితే ఆ నిబంధనలు నిజంగా నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు’ అంటూ నటి వివరించింది.