Sai Pallavi : మెగాస్టార్ సినిమానే రిజెక్ట్ చేసిన సాయిపల్లవి.. కారణం ఇదే?

టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ చిత్రం ఇటీవల రీలీజై.. బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డ విషయం తెలిసిందే.

Update: 2023-08-19 09:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ చిత్రం ఇటీవల రీలీజై.. బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డ విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరుకు చెల్లిలిగా కీర్తిసురేష్ నటించింది. అయితే చిత్ర బృందం ఈ హీరోయిన్ ప్లేస్‌లో టాలీవుడ్ నాచురల్ బ్యూటీ సాయిపల్లవిని చేయించాలని ప్రయత్నాలు చేశారట. కానీ ఈ హైబ్రిడ్ పిల్ల.. మెగాస్టార్ చెల్లెలిగా నటించడానికి అస్సలు అంగీకరించలేదట. ‘‘ఒక్కొక్కరు చిరు సినిమాలో ఓ మూలన ఛాన్స్ వస్తే చాలు అనుకుంటారు. కానీ సాయిపల్లవి ఎందుకు రిజెక్ట్ చేసినట్లు’’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ జనాలు ఈ వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Read More:    "భగవంత్ కేసరి" మూవీ తెలుగు స్టేట్స్ లో ఎన్ని కోట్లు బిజినెస్ చేసిందో తెలుసా? 

Tags:    

Similar News