బాలయ్య, చిరంజీవి సినిమాలకు నో చెప్పిన సాయి పల్లవి
రెమ్యునరేషన్ ఎక్కువగా ఇస్తే చాలు సినిమాలో క్యారెక్టర్ ఏంటో తెలియకపోయినా కమిట్ అవుతారు కొంత మంది హీరోయిన్లు.
దిశ, సినిమా: రెమ్యునరేషన్ ఎక్కువగా ఇస్తే చాలు సినిమాలో క్యారెక్టర్ ఏంటో తెలియకపోయినా కమిట్ అవుతారు కొంత మంది హీరోయిన్లు. కానీ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి మాత్రం అలా కాదు. కోట్లు కుమ్మరించినా కొన్ని పాత్రలకు మొహమాటం లేకుండా నో చెప్పేస్తుంది. ఇలా సాయి పల్లవి కాదనుకున్న ప్రాజెక్ట్స్‌లో బాలయ్య, చిరంజీవి సినిమాలు కూడా ఉన్నాయి. అవును బాలయ్య ‘వీర సింహారెడ్డి’లో చెల్లెలి క్యారెక్టర్ పోషించిన వరలక్ష్మి ప్లేస్‌లో మొదట సాయి పల్లవిని అనుకున్నారట. కానీ అలాంటి పాత్రలో నటించనని చెప్పేసిందట. ఇక చిరంజీవి అప్ కమింగ్ మూవీ ‘భోళా శంకర’లో కూడా చిరు చెల్లిగా కీర్తి కంటే ముందు సాయి పల్లవిని సెలెక్ట్ చేశారు. కానీ నో చెప్పిందట.