12 ఏళ్లకే సెక్సీగా కనిపిస్తున్నానని నా తల్లిని తిట్టారు: రివా అరోరా
బాడీ పార్ట్స్ పెరుగుదలకోసం చిన్న వయసులోనే ‘హ్యూమన్ గ్రోత్ హార్మోన్’ ఇంజెక్షన్లు తీసుకున్నట్లు వస్తున్న వార్తలపై రివా అరోరా స్పందించింది.
దిశ, సినిమా: బాడీ పార్ట్స్ పెరుగుదలకోసం చిన్న వయసులోనే ‘హ్యూమన్ గ్రోత్ హార్మోన్’ ఇంజెక్షన్లు తీసుకున్నట్లు వస్తున్న వార్తలపై రివా అరోరా స్పందించింది. కంటెట్ క్రియేటర్ అండ్ సోషల్ మీడియా పర్సనాలిటీగా భారీ పాపులారిటీ పొందిన ఆమె బాల్యంలోనే యుక్త వయసు అమ్మాయిగా కనిపించేందుకు సింథటిక్ గ్రోత్ హార్మోన్లను తీసుకున్నాననే ఆరోపణలు బాధించాయని చెప్పింది. ‘ఓ మ్యూజిక్ వీడియోలో మొదటిసారి కనిపించడంతో కొందరు వ్యక్తులు నన్ను గుర్తించలేకపోయామని చెప్పారు. 12 ఏళ్లకే సెక్సీగా కనిపిస్తున్నానని కామెంట్స్ చేశారు.
ఇంజెక్షన్లు ఇప్పించిందని నా తల్లిని దూషించారు. సోషల్ మీడియా నెగెటీవ్ కామెంట్స్ మమ్మల్ని చాలా బాధించాయి. నిజానికి నాకు 12 ఏళ్లు కాదు. అసలైన ఏజ్ ఏంటో త్వరలో వెల్లడిస్తా’ అని చెప్పింది. అలాగే తానెప్పుడూ విమర్శలను పెద్దగా పట్టించుకోనని, ప్రతికూలత ఉన్న దగ్గరే సానుకూలత కూడా ఉంటుందనే విషయాన్ని బలంగా నమ్ముతానని తెలిపింది. ‘నేను ఎల్లప్పుడూ ప్రకాశవంతమైన దిక్కులే చూడాలని ఫిక్స్ అయ్యాను. ప్రేక్షకుల నుంచి నాకు లభించిన ప్రేమ వీటన్నింటిని అధిగమిస్తుంది’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.