బేబీ బంప్ ఫొటోలతో షాకిచ్చిన హీరామండి నటి.. మొత్తం విప్పి చూపించడంతో నెటిజన్లు ఫైర్

గత కొద్ది రోజుల నుంచి హీరోయిన్స్ బేబీ బంప్ ఫొటో షూట్స్ వెరైటీగా ప్లాన్ చేసుకుంటున్నారు.

Update: 2024-09-23 13:21 GMT

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి హీరోయిన్స్ బేబీ బంప్ ఫొటో షూట్స్ వెరైటీగా ప్లాన్ చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం సౌత్ వాళ్లకి భిన్నంగా చేసుకుంటూ ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఇటీవల స్టార్ దీపికా పదుకొణె కూడా బిడ్డకు జన్మనివ్వకముందు బేబీ బంప్ ఫొటో షూట్‌లో మొత్తం ఓపెన్‌గా చూపించడంతో ఆమెపై విమర్శలు చేశారు. తాజాగా, మరో బాలీవుడ్ బ్యూటీ బేబీ బంప్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేయడంతో పాటు ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

రిచా చద్దా తన పొట్టని చూపించడంతో పాటు రొమ్ము భాగాన్ని కూడా దాదాపుగా ఓపెన్‌గా చూపించింది. అంతేకాకుండా బేబీ బంప్‌పై అన్ని ఏవో టాటూలు వేసుకుని దర్శనమిచ్చి షాకిచ్చింది. దీంతో ఈ ఫొటోలు చూసిన వారంతా ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే కొంచెం సాంప్రదాయంగా ఫొటో షూట్ చేసుకోవచ్చుగా అని ఫైర్ అవుతున్నారు. కాగా, రిచా చద్దా పలు సినిమాలు, వెబ్ సీరిస్‌ల్లో నటించి మెప్పించింది. ఇటీవల ఆమె హీరామండిలో నటించి మెస్మరైజ్ చేసింది. ఈ సిరీస్ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో అమ్మడు క్రేజ్ మరింత పెరిగింది. ఇక రిచా 2023లో నటుడు అలీ ఫజల్‌ను పెళ్లి చేసుకుంది. ఈ జంట ఫిబ్రవరిలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు వెల్లడించారు. అయితే వీరికి ఇటీవల పాప పుట్టినట్లు సమాచారం.


Similar News