నా పిరికి తనమే నన్ను ఇలా మార్చేసింది.. రియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

బాలీవుడ్ స్టార్ నిర్మాత రియా కపూర్ తన పర్సనల్ అండ్ సినీ జర్నీలో ఎదుర్కొన్న స్ట్రగుల్స్ గురించి ఓపెన్ అయింది.

Update: 2023-09-27 11:58 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నిర్మాత రియా కపూర్ తన పర్సనల్ అండ్ సినీ జర్నీలో ఎదుర్కొన్న స్ట్రగుల్స్ గురించి ఓపెన్ అయింది. ఆమె నిర్మించిన తాజా చిత్రం ‘Thank You For Coming’ అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. అయితే సినిమా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె అనారోగ్యంతో పోరాడుదూ, నిరంతరం సిగ్గుపడే ఒక ఆడపిల్ల స్థాయినుంచి నుంచి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవడం గురించి మాట్లాడింది.

‘ఒకప్పుడు నా చిరునవ్వును, నా ముఖాన్ని, నన్ను ఎప్పుడూ దాచుకునేదాన్ని. ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించగలిగే స్థాయిలో ఉన్నాను. దీని వెనుక కొన్నేళ్ల పట్టుదల, కృషి ఉంది. నా బలాన్ని తెలుసుకోవడం మొదలుపెట్టిన నేను.. అవమానాలు, ఆందోళనలు, సమస్యలను దాటుకుని వెలుగులోకి వచ్చాను. వినయంగా, భయానకమైన లైఫ్‌లోనుంచి కళ్లు తెరిచి అద్భుతమైన జీవితంలోకి అడుగుపెట్టడం నిజంగా లక్కీ. కాబట్టి నాలాంటి పిరికి అమ్మాయిలకు మరింత శక్తిని అందించే అవకాశం ఇస్తున్నందుకు ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చింది.

Read More:    నన్ను నా కూతురిని.. ప్రభాస్ ఫ్యాన్స్ బెదిరిస్తున్నారు.. వివేక్ అగ్నిహోత్రి! 

Tags:    

Similar News