డాగ్ లవర్ అయితే సరిపోదు.. మరోసారి హైదరాబాద్ మేయర్‌ను టార్గెట్‌గా చేసిన RGV
అంబర్‌పేట్‌లో వీధి కుక్కల దాడిలో మృతిచెందిన ప్రదీప్ ఘటనపై ఆర్జీవీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని టార్గెట్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: అంబర్‌పేట్‌లో వీధి కుక్కల దాడిలో మృతిచెందిన ప్రదీప్ ఘటనపై ఆర్జీవీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని టార్గెట్ చేశారు. గత కొన్ని రోజులుగా వరుస ప్రశ్నలు, విమర్శలతో మేయర్‌పై ఆర్జీవీ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా, అధికారిక హోదాలో మీరు ఏం చేయలేకపోతే.. కనీసం వ్యక్తిగత హోదాలోనైనా అంబర్‌పేట బాలుడి కుటుంబానికి సాయం చేయాలనిమేయర్ను కోరారు.
డాగ్లవర్ అయితే సరిపోదని.. తోటి మనుషులను కూడా ప్రేమించాలని మేయర్‌ను ట్యాగ్ చేస్తూ వర్మ మంగళవారం వరుస ట్వీట్లు చేశారు. బాలుడు ప్రదీప్ కుటుంబానికి తోటి పౌరులమైన మనం కూడా చేయూతనివ్వాలని, దయకలిగిన వారు ఎవరైనా ఉంటే ప్రదీప్ తల్లిదండ్రుల జాయింట్ అకౌంట్‌కు డబ్బు పంపి సాయం చేయాలని నగర ప్రజలను కోరారు. కాగా, ఇప్పటి వరకు సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోందని ఆర్జీవీ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.