‘కుక్క బిస్కెట్స్ వేసింది’.. వీరాభిమాని శ్రీదేవిపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రముఖ దర్శకుడు ఆర్జీవీకి దివంగత శ్రీదేవిని ఎంతలా అభిమానిస్తారో తెలిసిన విషయమే.

Update: 2024-10-02 04:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దర్శకుడు ఆర్జీవీకి దివంగత శ్రీదేవిని ఎంతలా అభిమానిస్తారో తెలిసిన విషయమే. ఎన్నోసార్లు ఈ హీరోయిన్‌పై ఉన్న అభిమానాన్ని ఎన్నో రకాలుగా తెలుపుతూనే ఉన్నారు. ఆమె మరణించి ఇన్నేళ్లైనా.. ఈ డైరెక్టర్ ఇంకా ఆమెను గుర్తుచేసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో శ్రీదేవి గురించి పోస్టులు పెడుతారు. అయితే తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు 100 సినిమాలు పూర్తిచేసుకున్న దానికి సంబంధించిన టీవీలో ఓ కార్యక్రమం వచ్చింది. ఈ కార్యక్రమానికి శ్రీదేవి అండ్ రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ.. తన సినీ కెరీర్ గురించి చెప్పుకొచ్చింది. బ్లాక్ బస్టర్ జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం తన జీవితంలోనే ప్రత్యేకమైనదని తెలిపింది. అలాగే పలు సినిమాల పేర్లు చెబుతూ.. లాస్ట్ కు క్షణం క్షణం చిత్రం కూడా ఒక అద్భుతం అంటూ చెప్పుకొచ్చింది. దీనికి ఆర్జీవీ వెంటనే స్పందించి.. ‘నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఏదో అలా చెబుతున్నారు.. కుక్క బిస్కెట్ వేసినట్లు’ అంటూ ఆర్జీవీ కాస్త బాధగా ఫేస్ పెట్టి అంటారు. ఆర్జీవీ అలగడంతో రాఘవేంద్రరావు అండ్ శ్రీదేవి.. అదేం లేదు ఆ మూవీ సూప్ హిట్ అయ్యింది. ఒక అద్భుతమైన చిత్రం అని కొనియాడుతారు.. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వుకుంటారు. ప్రస్తుతం వీరి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


Similar News