PAWAN KALYAN: ఎట్టకేలకు పవన్ కల్యాణ్‌పై ప్రేమ బయటపెట్టిన రేణు దేశాయ్.. నెట్టింట దుమారం రేపుతోన్న మాజీ భార్య ఇన్‌స్టా స్టోరీ
కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా, మోడల్‌గా, హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది నటి రేణు దేశాయ్.
దిశ, సినిమా: కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా, మోడల్‌గా, హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది నటి రేణు దేశాయ్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన బద్రి, జానీ సినిమాల్లో నటించి ఆయనతో ప్రేమలో పడింది. తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకుని, అకీరా, ఆద్యలకు జన్మనిచ్చారు. తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ వీరి బంధానికి ముగింపు పలికారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు. అకీరా, ఆద్యల బాగోగులు చూసుకుంటూ రేణు దేశాయ్.. ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరిస్తూ పవన్ కల్యాణ్ బిజీ అయిపోయారు. ఇకపోతే తాజాగా రేణు దేశాయ్ పవన్ కల్యాణ్ నటించిన ఖుషి సినిమాలోని ఏ మేరా జహా అనే పాట క్లిప్ ను పోస్ట్ చేసింది. ‘ఇది పాటను నేను 21 ఏళ్లు ఉన్నప్పుడు ఎడిట్ చేశాను.
ఈ సాంగ్‌లోని ప్రతి ప్రేమ్ నాకు గుర్తు ఉంది’’ అంటూ రేణు దేశాయ్ రాసుకొచ్చింది. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక మాజీ భార్య రేణు దేశాయ్ ఈ విధంగా ఇన్‌స్టా స్టోరీ పెట్టడం సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది. పవన్ కల్యాణ్ పై రేణు కు ఇంకా ప్రేమ ఉంది. కానీ బయటపెట్టలేకపోతుంది. ఇంకా ఆయనతో కలిసే ఉండాలని ఉంది. ఇండైరెక్ట్‌గా ఇలా చెబుతోంది. మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత ఆయనపై ప్రేమ బయటపెట్టిందంటూ పలువురు జనాలు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ ఇన్‌స్టా స్టోరీ సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్‌ను అయోమయంలో పడేసింది.