గోల్కొండ కోటలో ‘శంకర్ మహదేవన్’.. ఘనంగా వేడుకలు!
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో స్వర్ ధరోహర్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ‘స్వర్ విరాసత్ మహోత్సవ’ వేడుకలు మంత్రిత్వ శాఖ సహకారంతో ఘనంగా జరుగుతున్నాయి.
దిశ, సినిమా: హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో స్వర్ ధరోహర్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ‘స్వర్ విరాసత్ మహోత్సవ’ వేడుకలు మంత్రిత్వ శాఖ సహకారంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుక మొదటిరోజు గౌరవనీయులైన సాంస్కృతిక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి సమక్షంలో జరిగింది. ఇందులో ప్రముఖ గాయకుడు స్వరకర్త శంకర్ మహదేవన్ పాల్గొన్నారు. రెండో రోజు దేశంలోని ప్రసిద్ధ కవులు ముషాయిరాలు నోమన్ షౌక్, డా. తారిఖ్ కమర్, నుస్రత్ మెహదీ, విజయ్ తివారీ, జావేద్ ముసిరి, షాదాబ్, శ్రీ నివాస్ రావ్, జియా టోంకీ, భుసావలి, హైదర్ అమన్ హైదర్, అస్రార్ చందర్వి, రషీద్, అబ్ది, సట్లేజ్ రాహత్, షాహిద్ అంజుమ్, అస్ఫీ, కోకబ్ జాకీ పాల్గొన్నారు. కాగా స్వర్ ధరోహర్ ఫౌండేషన్ అధ్యక్షుడు గులాం మహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ‘భారతదేశం మొత్తం ప్రపంచానికి భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ. మన వారసత్వాన్ని కాపాడుకోవడం బాధ్యత కాదు. వారసత్వాన్ని అనుసరించడం ప్రతి భారతీయుడి కర్తవ్యం’ అని పేర్కొన్నాడు.
Also Read: ఎంతో మంది అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకున్న స్టార్ నటుడు