ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ సినీ నిర్మాత కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపార వేత్త పొలిశెట్టి రాంబాబు(58) కన్నుమూశారు.

Update: 2024-03-09 05:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపార వేత్త పొలిశెట్టి రాంబాబు(58) కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా దీర్ఘకాలిక వ్యాధులతో రాంబాబు బాధపడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడిచారు. గోపి గోడమీద పిల్లి, లక్ష్మీ పుత్రుడు వంటి సినిమాలకు రాంబాబు నిర్మాతగా వ్యవహరించారు. గతంలో సీపీఎం పార్టీ అనుబంధ సంఘమైన ప్రజానాట్యమండలిలోనూ పనిచేశారు. ఆయన మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులు, కమ్యూనిస్టు నాయకులు సంతాపం ప్రకటిస్తున్నారు.

Tags:    

Similar News