ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి మృతి
గుండెపోటుతో శ్రీనివాస మూర్తి చనిపోయారు. ఆ
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి కన్నుమూశారు. శుక్రవారం ఉదయం గుండెపోటుతో చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లు సేవలంధించారు. ప్రముఖ తమిళ నటులు అబిజీత్, విక్రమ్, సూర్య, మోహన్‌లాల్‌తోసహా పులువురు స్టార్ హీరోలకు తెలుగులో డబ్బింగ్ చెప్పిన శ్రీనివాస మూర్తి కొన్ని చిత్రాలలో కూడా నటించారు. సూర్య నటించిన సింగం సిరీస్‌లో శ్రీనివాస మూర్తి డబ్బింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన గంభీరమైన స్వరంతో ఆయన తెలుగులో సూర్య పాత్రకు ప్రాణం పోశారు. దాదాపు వెయ్యి చిత్రాలకు ఆయన తెలుగులో డబ్బింగ్ చెప్పారు. తెలుగు నటుడు రాజశేఖర్‌తోపాటు బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లకు కూడా ఆయన తెలుగులో డబ్బింగ్ చెప్పారు
Also Read...
నరేశ్- రమ్య ఇష్యూలో ఊహించని ట్విస్ట్.. తెరపైకి మాజీ మంత్రి పేరు