స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు కొట్టేసి.. భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన శ్రీలీల

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల తెలుగులో ‘పెళ్లి సందడి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

Update: 2023-03-03 06:06 GMT

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల తెలుగులో ‘పెళ్లి సందడి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా’ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో ఛాన్స్ కొట్టేసి దూసుకుపోతోంది. దాదాపు శ్రీలీల చేతిలో 9 సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ అమ్మడు భారీగా పారితోషికం తీసుకుంటుందట.

ఒక్క సినిమాకు దాదాపు రూ. 2 కోట్లకు పైగా అందుకుంటున్నట్లు సమాచారం. కొంత మంది నిర్మాతలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారట. దీనికి శ్రీలీల మాత్రం తగ్గించుకునే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలంతా ఎక్కువగా శ్రీలీలనే ఎంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడి చిత్రం

Tags:    

Similar News