సీఎం కొడుకుతో రిలేషన్‌షిప్.. నా జీవితాన్ని నాశనం చేయకండి అంటూ యంగ్ హీరోయిన్ ఎమోషనల్ నోట్

యంగ్ బ్యూటీ నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘మెంటల్ మదిలో’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

Update: 2024-03-06 02:35 GMT
సీఎం కొడుకుతో రిలేషన్‌షిప్.. నా జీవితాన్ని నాశనం చేయకండి అంటూ యంగ్ హీరోయిన్ ఎమోషనల్ నోట్
  • whatsapp icon

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘మెంటల్ మదిలో’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, పాగల్, దాస్‌కా ధమ్‌కీ, రెడ్ వంటి చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు అడపా దడపా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. నివేదా పేతురాజ్ నటి మాత్రమే కాదు రేసర్, బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. అయితే ఇటీవల ఈ అమ్మడు తమిళనాడు సీఎం ఎమ్‌కె స్టాలిన్ కొడుకు ఉదయ నిధి స్టాలిన్‌తో నివేదా పేతురాజ్ రిలేషన్‌లో ఉందని ఆమె కోసం ఎంత డబ్బు అయినా ఖర్చు చేస్తున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా, నివేదా తన ట్విట్టర్ వేదికగా స్పందించి క్లారిటీ ఇచ్చింది.

‘‘నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇటీవల తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. నేను మౌనంగా ఉన్నాను ఎందుకంటే దీని గురించి మాట్లాడే వ్యక్తులు ఒక అమ్మాయి జీవితాన్ని బుద్ధి హీనంగా పాడు చేసే ముందు వారు అందుకున్న సమాచారాన్ని ధృవీకరించడానికి కొంత మానవత్వం కలిగి ఉంటారని నేను భావించాను. కొన్ని రోజులుగా నేను, మా కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. నేను చాలా గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నేను 16 సంవత్సరాల వయస్సు నుండి ఆర్థికంగా స్వతంత్రంగా స్థిరంగా ఉన్నాను. నా కుటుంబం ఇప్పటికీ దుబాయ్‌లో నివసిస్తోంది. 20 ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటున్నాం.

సినిమా ఇండస్ట్రీలో కూడా నాకు ఛాన్స్ ఇవ్వమని ఏ రోజు ఏ నిర్మాతను, డైరెక్టర్ ని, హీరోని అడగలేదు. నేను 20కి పైగా సినిమాలు చేశాను, అవన్నీ నా దగ్గరికి వచ్చిన అవకాశాలే. నేను డబ్బు కోసం అత్యాశ పడను. నా గురించి వచ్చిన వార్తలు అన్ని అబద్దాలే. మేము 2002 నుండి దుబాయ్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాము. నేను చాలా సాధారణ లైఫ్ గడుపుతాను. జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాతే నేను ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నాను. మీ కుటుంబంలోని ఆడవాళ్లు కోరుకున్నట్టే నేను కూడా గౌరవప్రదమైన, ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటున్నాను. అలాగే, 2013 నుండి రేసింగ్ అంటే నాకు మక్కువ. నిజానికి చెన్నైలో నిర్వహిస్తున్న రేసుల గురించి నాకు తెలియదు. నేను చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నాను.

జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాత నేను మానసికంగా బలంగా మారి ధైర్యంగా ముందడుగు వేశాను. జర్నలిజంలో కొంత మానవత్వం మిగిలి ఉందని, నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. నేను దీనిని చట్టబద్ధంగా తీసుకోలేదు. మా కుటుంబాన్ని ఇకపై ఎలాంటి బాధలకు గురి చేయకుండా మీరు స్వీకరించే సమాచారాన్ని చెక్ చేసుకోవాలని నేను జర్నలిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. సత్యాన్ని గమనించగలరని కోరుతున్నాను’’ అంటూ రాసుకొచ్చింది.

Tags:    

Similar News