Regina Cassandra : ఎల్లో చీరలో మెరిసిపోతున్న రెజీనా..
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్లలో రెజీనా ఒకరు.
దిశ, సినిమా: టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్లలో రెజీనా ఒకరు. ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ‘ఎవరు’ చిత్రంలో బోల్డ్ పర్ఫామెన్స్‌తో మెప్పించింది. అయితే ఇటీవల ఆమెకు కమర్షియల్ చిత్రాల కంటే లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్‌లోనే ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో థ్రిల్లర్, హారర్ చిత్రాలకు పెట్టింది పేరుగా మారిపోయింది. చివరగా ‘శాకినీ డాకినీ’ అనే చిత్రంతో మెప్పించిన ఈ బ్యూటీ.. మరిన్ని ఆఫర్స్ కోసం ఎదురుచూస్తోంది.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే రెజీనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ ఫొటోస్‌ను షేర్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఎల్లో చీరలో మెరుపులు మెరిపిస్తోంది. ఎప్పుడు హాట్ లుక్‌లో హీట్ పుట్టించే ఈ చిన్నది.. చిరునవ్వులు చిందిస్తూ ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంటుంది.