ఆ స్టార్ హీరో కోసం దేన్నైనా వదులుకోవడానికి రెడీ.. తన కోరికను ఓపెన్‌గా చెప్పిన ప్రియమణి!
హీరోయిన్ ప్రియమణి ఒకప్పుడు టాలీవుడ్ స్టార్స్ సరసన నటించి ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా కొద్ది కాలం పాటు రాణించింది.
దిశ, సినిమా: హీరోయిన్ ప్రియమణి ఒకప్పుడు టాలీవుడ్ స్టార్స్ సరసన నటించి ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా కొద్ది కాలం పాటు రాణించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. కొద్ది రోజుల క్రితమే బుల్లితెర షోలో ప్రత్యక్షమైంది. ఇందులో జడ్జ్‌గా వ్యవహరించి దర్శక నిర్మాతల చూపును ఆకట్టకుంది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో నాగచైతన్య కస్టడీ సినిమాతో ప్రియమణి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి గ్యాప్ లేకుండా విభిన్న పాత్రల్లో వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది.
ప్రస్తుతం ప్రియమణి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అయితే ఆమె నటించిన తాజా చిత్రం ‘మైదాన్’. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రియమణి ఓ స్టార్ హీరోపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాను ఇటీవల నటించిన జవాన్ హీరో షారుఖ్ ఖాన్‌ను తన మాటలతో ఆకాశానికి ఎత్తేసింది. ‘‘ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కోసం ఏదైనా వదులుకోవడానికి రెడీగా ఉన్నాను. ఒకవేళ ఆయన నాకు ఫోన్ చేసి సినిమా చేద్దామంటే.. ఏదైనా సరే వదులుకుని వెళతాను. ఈ విషయాన్ని మీడియా వారే షారుఖ్ దగ్గరకు తీసుకువెళ్లాలి’’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ప్రియమణి ఇప్పటికే ఆయనతో రెండు చిత్రాల్లో నటించింది. మరి మూడోసారి షారుఖ్ చాన్స్ ఇస్తాడో లేదో చూడాల్సి ఉంది.