Ravi Teja: షూటింగ్లో రవితేజకు ప్రమాదం.. పరిస్థితి వివరించిన డాక్టర్లు
కథానాయకుడు రవితేజ ఇటీవల షూటింగ్లో ప్రమాదానికి గురయ్యారు.
దిశ, సినిమా: కథానాయకుడు రవితేజ ఇటీవల షూటింగ్లో ప్రమాదానికి గురయ్యారు. సినిమా షూటింగ్లో భాగంగా ఆయనకు ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్లో ఆయన కుడిచేతికి గాయం కాగా.. గత కొన్ని రోజులుగా గాయంతోనే రవితేజ షూటింగ్లో పాల్గొంటున్నారు. విశ్రాంతి లేకపోవడంతో గాయం మరింత ఎక్కువ కావడంతో హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో శుక్రవారం ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించారు.
శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశామని డాక్టర్లు తెలిపారు. రవితేజకు ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ఆర్టీ 75 సినిమా చిత్రీకరణలో ఈ ప్రమాదం జరిగింది. భాను భోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.