Mr. Bachchan: ఓటీటీలోకి రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ మూవీ.. స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన విడుదల (పోస్ట్)

మాస్ మహారాజా రవితేజ నటించిన మూవీ ‘మిస్టర్ బచ్చన్’. దీనిని హరీష్ శంకర్ తెరకెక్కించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.

Update: 2024-09-07 07:14 GMT

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ నటించిన మూవీ ‘మిస్టర్ బచ్చన్’. దీనిని హరీష్ శంకర్ తెరకెక్కించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అయితే ఈ సినిమాతో బాలీవుడ్ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మిస్టర్ బచ్చన్ భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.

అలాగే ఇందులోని సాంగ్స్‌పై నెటిజన్లు ట్రోల్స్ కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే మిస్టర్ బచ్చన్ సినిమా విడుదలై నెల పూర్తి కావస్తుండటంతో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. తాజాగా, మిస్టర్ బచ్చన్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన విడుదలైంది. విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 12 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా నెట్‌ఫ్లిక్స్ షేర్ చేసింది.


Similar News