నాకెప్పుడో పెళ్లి జరిగిపోయింది.. షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన Rashmika Mandanna
నేషనల్ క్రష్ రష్మిక మందనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు పుష్ప సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. ఇక ప్రస్తుతం వరస సినిమాలతో చాలా బిజీగా ఉంటుంది. అయితే రష్మిక మందనకు సంబంధించిన
దిశ, వెబ్‌డెస్క్ : నేషనల్ క్రష్ రష్మిక మందనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు పుష్ప సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. ఇక ప్రస్తుతం వరస సినిమాలతో చాలా బిజీగా ఉంటుంది. అయితే రష్మిక మందనకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ నెట్టింట ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా రష్మిక విజయ్ దేవరకొండతో లవ్‌లో ఉంది వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎన్నో రూమర్స్ వస్తుంటాయి. అయితే తాజాగా రష్మికకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే? నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయిదంటూ తన సీక్రెట్ బయట పెట్టింది.
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఓ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న సమయంలో, యాంకర్ రష్మికను పెళ్లి ఎప్పుడు అని అడగగా, దానికి రష్మిక మందన స్పందిస్తూ..నాకు ఎప్పుడో పెళ్లయిపోయింది. నాకు పెళ్లయింది ఎవరితోనో కాదు నరుటో తో.. అంటూ అందరూ నవ్వుకునే ఆన్సర్ ఇచ్చింది. అయితే నరుటో అంటే ఎవరో కాదు ఎంతో ఫేమస్ అయినటువంటి ఎనిమీ సిరీస్ లోని ఒక పాత్ర పేరు.ఇక ఈ పాత్రకి చాలామంది అభిమానులు ఉంటారు. అయితే అందులో రష్మిక కూడా ఒకరు కావచ్చు. అందుకే రష్మిక నాకు నరుటో తో పెళ్లయింది అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది.
Read More: ఎయిర్‌పోర్టులో శ్రద్ధాకు ఊహించని షాక్ ఇచ్చిన యువకుడు.. ప్రపోజల్ వీడియో వైరల్