Rashmika Mandanna: ప్రతిరోజూ మా పనిమనిషి కాళ్లు మొక్కుతా.. అదే నా ఆనందానికి కారణం

రీసెంట్‌‌గా ఓ సమావేశంలో పాల్గొన్న నటి తన వ్యక్తిగత ఫీలింగ్స్, వాల్యూస్ గురించి వివరించింది.

Update: 2023-03-24 06:51 GMT
Rashmika Mandanna: ప్రతిరోజూ మా పనిమనిషి కాళ్లు మొక్కుతా.. అదే నా ఆనందానికి కారణం
  • whatsapp icon

దిశ, సినిమా : పద్ధతులు, విలువలే మనం ఏంటో సమాజానికి తెలియజేస్తాయంటోంది రష్మిక మందన్నా. అంతేకాదు మనుష్యుల మధ్య విబేధాలు, హెచ్చుతగ్గులు చూడటం కూడా తనకు ఇష్టం ఉండదని చెబుతోంది. రీసెంట్‌‌గా ఓ సమావేశంలో పాల్గొన్న నటి తన వ్యక్తిగత ఫీలింగ్స్, వాల్యూస్ గురించి వివరించింది. ‘ఏ చిన్న విషయమైనా సరే నేను అంత సులువుగా వదిలిపెట్టను. నిద్ర లేవగానే పెంపుడు జంతువులతో సమయం గడుపుతా. తర్వాత స్నేహితులను కలుస్తా. ఇలా చేస్తేనే నాకు హ్యాపీగా ఉంటుంది. అలాగే మనం మాట్లాడే ప్రతి మాట విలువైనదిగానే భావించాలా. అనసవరమైన విషయాలు, మాటలతో కొన్ని బంధాలు ఏర్పడితే, మరికొన్ని తెగిపోతాయి. నా డైరీలో ప్రతి విషయాన్ని రాసుకుంటా. బయటనుంచి ఇంటికి వెళ్లగానే పని మనిషితో పాటు ప్రతి ఒక్కరి కాళ్లు మొక్కుతా. అందరి మీద గౌరవంతోనే ఆ పని చేస్తా. నేను ఎవరిని వేరు చేసి చూడను’ అంటూ వివరించింది.

Read more:

కొడుకుల గొడవపై మోహన్ బాబు రియాక్షన్ ఇదే!

Tags:    

Similar News