Rashmika: ఆ స్టెప్ వేయడం నా వల్ల కాదు.. ప్లీజ్ ఇక అడగొద్దు
‘పుష్ప’ సినిమాలోని ‘సామీ సామీ’ పాట డ్యాన్స్‌పై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
దిశ, సినిమా : ‘పుష్ప’ సినిమాలోని ‘సామీ సామీ’ పాట డ్యాన్స్‌పై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు ఇకపై ఆ స్టెప్పులు వేయలేనంటూ అభిమానులకు షాక్ ఇచ్చింది. విషయానికొస్తే.. ‘సామీ సామీ’ పాట విడుదలైనప్పటినుంచి తాను పాల్గొన్న ప్రతి ఈవెంట్లో స్టేజ్ మీదే తనతో స్టెప్పులేయిస్తున్నారని వాపోయిన నటి..‘అభిమానులను నిరాశ పరచడం ఇష్టంలేక ఇంతకాలం ఆ డ్యాన్స్ చేశాను. ఇకపై ఆ స్టెప్ వేయలేను. ఎందుకంటే ఇలాగే ఆ స్టెప్ వేస్తూవుంటే నేను ముసలిదాన్ని అయ్యాక నా నడుములో సమస్యలు వస్తాయి. అయినా ఆ స్టెప్పే ఎందుకు వేయాలి? ఇంకా కొత్తగా వేరే ఏదైనా ట్రై చేద్దాం’ అని చెప్పేసింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘పుష్ప2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
తాప్సీపై దారుణంగా ట్రోల్స్.. లక్ష్మీదేవి ఆభరణం అక్కడ ధరించడంపై ఫైర్