Boys Hostelలో స్టే చేసేంత సీన్ లేదంటున్న Rashmi.. ఏజ్ గ్యాప్ ఉందంటూ
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్న జర్నలిస్ట్ సురేష్ కొండేటి.
దిశ, సినిమా: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్న జర్నలిస్ట్ సురేష్ కొండేటి. సినీ ప్రెస్ మీట్‌లలో ఇతను అడిగిన కొన్ని ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి. ఇతని మాటలవల్ల సినీ ప్రముఖులు, నెటిజన్లు మండిపడుతున్నారు. అయినప్పటికీ అవేమీ పట్టించుకోని సురేష్ తన ప్రశ్నల డోస్‌తో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల కన్నడలో హిట్ మూవీ ‘హాస్టల్ హుడుగరు బేకాగిద్దరే’ను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా యాంకర్ రష్మీ గౌతమ్ కూడా హాజరైంది. ఈ సందర్భంగా సురేష్ కొండేటి ‘బాయ్స్ హాస్టల్‌లో స్టే చేసే బాయ్ ఫ్రెండ్స్ మీకు రియల్ లైఫ్‌లో ఎవరైనా ఉన్నారా?’ అని ప్రశ్నించాడు. దీంతో రష్మికి ‘ఇప్పుడు నేను బాయ్స్ హాస్టల్‌లో స్టే చేసేంత ఫ్రెండ్స్ లేరు. చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది’ అని దిమ్మతిరిగే సమాధానమిచ్చింది రష్మి. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వడం స్టార్ట్ చేశారు. ప్రజెంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
నీ కోసమే ఇప్పటివరకు బతికున్నా.. స్టేజ్ మీదనే Rashmi కి మరోసారి ప్రేమ విషయం చెప్పిన Sudheer
పెద్ద సినిమాల రీ-రిలీజ్‍లపై.. బిగ్‍బాస్ సోహెల్ కీలక వ్యాఖ్యలు