బెడ్ పై సంతృప్తి కోసం పడుకునే ముందు అది చేయమంటున్న హీరో.. బాగానే ప్లాన్ చేశావని కామెంట్స్

బాలీవుడ్ యంగ్ హీరో రణ్ వీర్ సింగ్ మరోసారి కాంట్రవర్షియల్ యాడ్ తో వచ్చాడు. పురుషుల శృంగార ఆరోగ్యమే తన ధ్యేయం అంటూ ఓ సెక్సువల్ ప్రొడక్ట్ బ్రాండ్

Update: 2024-04-05 02:44 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ హీరో రణ్ వీర్ సింగ్ మరోసారి కాంట్రవర్షియల్ యాడ్ తో వచ్చాడు. పురుషుల శృంగార ఆరోగ్యమే తన ధ్యేయం అంటూ ఓ సెక్సువల్ ప్రొడక్ట్ బ్రాండ్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఆయన.. ఇంతకు ముందు సీరియల్ మాదిరిగా యాడ్ ప్లాన్ చేస్తే ఇప్పుడు ఎండార్స్మెంట్ టైప్ లో సెక్స్ ఇష్యూస్ పై డిస్కస్ చేశాడు. బెడ్ పై సంతృప్తి చెందాలంటే తను చెప్పిన విధంగా చేయాలని, ఈ ప్రొడక్ట్ వాడాలని సూచించి.. నెట్టింట విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

కాగా గతంలో టెలివిజన్ నటి రేణు దేశాయ్ తో పాటు పలువురు సీరియల్ యాక్టర్స్ ఈ యాడ్ వివాదాస్పదంగా ఉందని, తమను అవమాన పరిచాడని ఫైర్ అయ్యారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ తాను ఎలాంటి తప్పు చేయలేదని, అవగాహన కల్పించడం నేరం ఎలా అవుతుందని సమాధానం ఇచ్చాడు రణ్ వీర్. ఇక నెటిజన్స్ ఈ యాడ్ చూశాక.. ఇలా కూడా ప్లాన్ చేయొచ్చని ఇప్పుడే అర్థమైందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ రోజుల్లో తాము స్కిప్ చేయని యాడ్ ఇదేనని.. మీ బ్రాండ్ వినియోగించుకోవడాన్ని అస్సలు మరిచిపోమని అంటున్నారు.


Similar News